ఎపి ఇఎపిసెట్‌ ఫలితాల్లో శ్రీచైతన్య విజయభేరి

Jun 11,2024 21:18 #Business

ప్రజాశక్తి – హైదరాబాద్‌ :ఎపి ఇఎపిసెట్‌-2024 ఫలితాల్లో తమ విద్యార్థులు విజయభేరి మోగించారని శ్రీచైతన్య విద్యా సంస్థ తెలిపింది. అగ్రి, ఫార్మాలో స్టేట్‌ ఒక్కటవ ర్యాంక్‌తో పాటు టాప్‌ 10లోపు 9 ర్యాంకులను, ఇంజనీరింగ్‌లో స్టేట్‌ 4వ ర్యాంక్‌, 7వ ర్యాంక్‌, 8వ ర్యాంక్‌లతో 10లోపు 3 ర్యాంక్‌లు సాధించినట్లు వెల్లడించింది. దీంతో ఇఎపిసెట్‌లో శ్రీచైతన్యదే ఆధిపత్యం అని మరోసారి నిరూపించుకున్నట్లయ్యిందని పేర్కొంది. అగ్రి, ఫార్మాలో ఎల్లు శ్రీకాంత్‌ రెడ్డి ఒక్కటో ర్యాంక్‌, పూల దివ్యతేజ (2వ), వడ్లపూడి ముకేష్‌ చౌదరి (3వ), పేర సాత్విక్‌ (4వ), అలూర్‌ ప్రణీత (5వ), గట్టు బానుతేజ సాయి (6వ), పి నిహారిక రెడ్డి (7వ), శంబంగి మనోఅభిరాం (8వ), శరగడం పావని (9వ) వరుస ర్యాంక్‌లను సాధించారని తెలిపింది.
ఇంజనీరింగ్‌లో పలగిరి సతీష్‌ రెడ్డి 4వ ర్యాంక్‌, గొల్ల లేఖహర్ష 7వ ర్యాంక్‌, పుట్టి కుశాల్‌ కుమార్‌ 8వ ర్యాంక్‌ల్లో నిలిచారని పేర్కొంది. అగ్రి, ఫార్మాలో 100 లోపు 50 ర్యాంక్‌లు పొందారని తెలిపింది. ఇంజనీరింగ్‌లో టాప్‌ 10లోపు 3 ర్యాంక్‌లు, 100 లోపు 55 ర్యాంక్‌లు సాధించారని వెల్లడించింది. అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు, అధ్యాపక బృందానికి శ్రీచైతన్య విద్యా సంస్థల అకాడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ అభినందనలు తెలిపారు.

➡️