- 11 నెలల కనిష్టానికి ఈక్విటీ ఎంఎఫ్‌లు
- మార్చిలో 14 శాతం తగ్గుదల
న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్లలో నెలకొన్న అస్థిరత మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులపై తీవ్రంగా పడుతోంది. అమెరికా టారిఫ్‌ల దెబ్బకు తీవ్ర ప్రతికూలతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో మార్కెట్లలో ఈ ఏడాది మార్చిలో ఈక్విటీ మ్యూచు వల్ ఫండ్ల పెట్టుబడులు రూ.25,082 కోట్లకు తగ్గాయి. ఇది 11 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. ఇంతక్రితం ఫిబ్రవరి ఎంఎఫ్ పెట్టు బడుల్లోనూ 14 శాతం పతనం చోటు చేసుకుంది. మరోవైపు గడిచిన మార్చిలో క్రమబద్దమైన పెట్టుబడులు ఎస్‌ఐపిలు రూ.25,925 కోట్లకు తగ్గి.. నాలుగు నెలల కనిష్టానికి పడిపోయాయి. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండ ియా (ఎఎంఎఫ్‌ఐ) గణంకాల ప్రకారం.. గడిచిన మార్చిలో ఈక్విటీ ఆధారిత ఎంఎఫ్‌ల్లో రూ.25, 082 కోట్ల పెట్టుబడులు చోటు చేసుకున్నాయి. ఇంతక్రితం ఫిబ్రవరి నెలలో రూ.29,303 కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్ 2024లో రూ.18,912 కోట్ల ఈక్విటీ ఎంఎఫ్‌లు చోటు చేసుకోగా.. ఆ తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి.