ముంబయి : వరుసగా రెండో సెషన్‌లోనూ భారత స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టాయి. కొనుగోళ్ల మద్దతుతో మంగళవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ 1,578 పాయింట్లు పెరిగి 76,735కు చేరింది. ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 500 పాయింట్లు లాభపడి 23,328 వద్ద ముగిసింది. అమెరికా బాండ్‌ల పతనం, వాణిజ్య చర్చల ఆశాభావం, డాలర్ బలహీనత, యుఎస్ ఫెడ్ విధానాలపై భిన్నాభిప్రాయాలు, ఆర్‌బిఐ ద్రవ్యోల్బణ అంచనాల తగ్గుదల మార్కెట్లకు ప్రధాన మద్దతును అందించాయి. ట్రంప్ సుంకాలను 90 రోజులు పాటు నిలిపివేసిన తర్వాత వాణిజ్య చర్చలు జరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనాలు మార్కెట్లలో విశ్వాసాన్ని పెంచాయి.
