న్యూఢిల్లీ : అంతర్జాతీయ వాణిజ్యంలో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు (ఎస్‌ఎంఇ) ఆర్థిక అవసరాలను తీర్చనున్నానమని ఆన్‌లైన్ ఫైనాన్సీంగ్ సంస్థ స్టెన్ తెలిపింది. ఇందుకోసం వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఐఇఒ)తో భాగసామ్యం కుదర్చుకున్నట్లు తెలిపింది. ఈ ఒప్పందలో ఎఫ్‌ఐఇఒ డైరెక్టర్ జనరల్ అజరు సహారు, అధ్యక్షుడు అశ్వని కుమార్, స్టెన్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ నోయెల్ హిల్‌మాన్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 20 బిలియన్ల విలువైన ఇన్‌వాయిస్‌లకు ఆర్థిక సహాయం చేయడంలో మద్దతును అందిస్తున్నట్లు పేర్కొంది. ఈ భాగస్వామ్యం ఎస్‌ఎంఇలు తమ కార్యకలాపాలను విస్తరించటానికి, అంతర్జాతీయ అవకాశాలను చేజిక్కించుకోవడానికి మద్దతును అందించనుందని ఇరు సంస్థలు తెలిపాయి.
