Stock market crash : మూడు లక్షల కోట్ల దాకా నష్టపోయిన మదుపరులు

ముంబయి : భారత బెంచ్‌ మార్క్‌ ఈక్విటీ సూచీలు సోమవారం భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్‌ వెయ్యి పాయింట్లు, నిఫ్టీ 26 వేల మార్క్‌కు పడిపోయాయి. దీంతో రిలయన్స్‌ ఇండిస్టీస్‌, ఐటి, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌ పతనానికి దారితీశాయి. బిఎస్‌ఇలో అన్ని లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ. 2.73 లక్షల కోట్ల తగ్గి రూ. 475.2 లక్షల కోట్లకు చేరుకుంది. రిలయన్స్‌ ఇండిస్టీస్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంకులు సెన్సెక్స్‌ 535 పాయింట్లు పతనమయ్యాయి. ఇక వీటితోపాటు భారతి ఎయిర్‌టెల్‌, ఎంఅండ్‌ఎం, ఎస్‌బిఐ, టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌ కూడా పతనానికి దోహదపడ్డాయి.
నిఫ్టీ బ్యాంక్‌, ఆటో, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఐటి, మీడియా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీలు 1.6 శాతం వరకు పడిపోయాయి. ఇండియా విఐఎక్స్‌ 6.3 శాతం పెరిగి 12.7 శాతానికి చేరుకుంది. అయితే, నిఫ్టీ మెటల్‌ 1.5 శాతం లాభపడింది. ఇండెక్స్‌లో ఎన్‌ఎండిసి, హిందాల్కో, సెయిల్‌ టాప్‌ గెయినర్లుగా ఉన్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రత్యేకించి లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం సాగిస్తున్న దాడులు వల్ల ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది.

➡️