ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. ట్రేడింగ్ ముగింపులో నష్టాల్లో కొనసాగాయి. ప్రధాన షేర్లు క్షీణించడం, అంతర్జాతీయ సంస్థల నుండి సానుకూల సంకేతాలు లేకపోవడం, ఆసియా మార్కెట్ల బలహీనమైన పనితీరు కారణంగా స్టాక్ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా నష్టపోయి రూ.79,043.74 వద్ద ముగిసింది. నిఫ్టీ మళ్లీ 24 వేల పాయింట్ల దిగువకు చేరి 23,914.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎస్‌బిఐ, శ్రీరామ్ ఫైనాన్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ లాభాల్లో ముగిశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అదానీ పోర్ట్స్, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ నష్టాల్లో ముగిశాయి.