Stock Market – భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు ….

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 1000కి పైగా పాయింట్ల లాభంతో, నిఫ్టీ 300కు పైగా పాయింట్ల లాభంతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి. శుక్రవారం ఉదయం 9 గంటల 17 నిముషాల సమయానికి సెన్సెక్స్‌ 1121 పాయింట్లు లాభపడి 74,961 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 348 పాయింట్ల లాభంతో 22,744 వద్ద ట్రేడవుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సుంకాలకు 90 రోజులు బ్రేక్‌ ఇవ్వడం, ఆర్‌బిఐ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం వంటి కారణాలతో దేశీయ సూచీలు పాజిటివ్‌గా కదులుతున్నాయి.

➡️