ముంబయి : టెక్ కంపెనీ స్ట్రింగ్ మెటావర్స్ లిమిటెడ్ రైట్ ఇష్యూకు విశేష స్పందన లభించింది. విజయవంతంగా తమ రైట్ ఇష్యూను ముగించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఈ ఇష్యూలో పబ్లిక్ ఇన్వెస్టర్ల నుంచి రూ.49.25 కోట్ల నిధులు సమీకరించినట్లు తెలిపింది. దీంతో 94,71,445 షేర్లను జారీ చేయడం ద్వారా తమ సంస్థలో పబ్లిక్ షేర్‌హోల్డింగ్ 19 శాతానికి పెరిగిందని పేర్కొంది. తమ రైట్ ఇష్యూకు రూ.100 కోట్ల ఒవర్‌సబ్‌స్రైబ్ లభించిందని తెలిపింది.
