బుక్‌ మై షో సిఇఒకు మళ్లీ సమన్లు

న్యూఢిల్లీ : బ్లాక్‌ టికెట్ల వ్యవహారంలో బుక్‌ మై షో సిఇఒ, సహ వ్యవస్థాపకుడు అశీష్‌ హేమరాజని కి ముంబయి పోలీసులు మరోమారు నోటీసులు జారీ చేశారు. బ్రిటిష్‌ రాక్‌ బ్యాండ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించి బ్లాక్‌ టికెట్లు విక్రయించినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ కోరుతూ ముంబయి పోలీసు ఎనకామిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ శనివారం అశీష్‌తో పాటు కంపెనీ టెక్నికల్‌ హెడ్‌కు సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై స్పష్టత ఇవ్వాలని, విచారణ అధికారి ఎదుట హాజరు కావాలని తాజా నోటీసులో పేర్కొన్నారు.

➡️