టాటా మోటార్స్‌ గ్లోబల్‌ అమ్మకాల్లో పెరుగుదల

న్యూఢిల్లీ : దిగ్గజ ఆటోమోబైల్‌ కంపెనీ టాటా మోటార్స్‌ అమ్మకాల్లో స్వల్ప వృధ్ధి చోటు చేసుకుంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం (2024-25) అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో అంతర్జాతీయంగా ఒక్క శాతం పెరుగుదలతో 3,41,791 యూనిట్ల టోకు విక్రయాలు చేసినట్లు గురువారం వెల్లడించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో 1,39,829 యూనిట్ల అమ్మకాలు నమోదయ్యాయి. గడిచిన క్యూ3లో జాగ్వర్‌ లాండ్‌ రోహర్‌ గ్లోబల్‌ విక్రయాలు 3 శాతం పెరిగి 1,04,427 యూనిట్లుగా చోటు చేసుకున్నాయని పేర్కొంది. వాణిజ్య వాహన అమ్మకాలు మాత్రం ఒక్క శాతం తగ్గి 97,535 యూనిట్లుగా నమోదయ్యాయి.

➡️