న్యూఢిల్లీ : ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) దాఖలుకు సంబంధించి గడువు సమీపిస్తోంది. ఆర్ధిక సంవత్సరాలు 2021-22, 2022-23లకు సంబంధించి పన్ను చెల్లింపు దారులు 2025 మార్చి 31 లోపు ఐటిఆర్‌ను దాఖలు చేయాల్సి ఉంది. సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరం ముగిసిన రెండు సంవత్సరాలలోపు మాత్రమే ఇది చేయాల్సి ఉంటుంది. అదే విధంగా పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లలో ఉన్న లోపాలను సరిదిద్దుకుని అప్‌డేట్ చేసిన రిటర్న్‌లను దాఖలు చేసేందుకు అవకాశం ఉంది.
