గూర్‌గావ్ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ సామ్‌సంగ్ కొత్తగా గెలాక్సీ ఎస్24 అల్ట్రా, గెలాక్సీ ఎస్24 స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు తెలిపింది. అసమాన భద్రతతో పాటు మూడేళ్ల వారంటీతో వీటిని అందిస్తున్నట్లు పేర్కొంది. ఏడేళ్ల వరకు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్, సెక్యూరిటీ మెయింటనెన్స్ హామీ ఇస్తున్నట్లు పేర్కొంది. గెలాక్సీ ఎస్24 ధరలు రూ.78,999 నుంచి ప్రారంభమవుతాయని పేర్కొంది. 8జిబి ర్యామ్, 256 జిబి స్టోరేజ్ ఎంపిక ఉంటుందని పేర్కొంది.
