న్యూఢిల్లీ : భారత కుటుంబాల్లో పావు శాతం లోపు మంది ఆదాయాలు మాత్రమే పెరగొచ్చని అంచనా. ఈ ఏడాది 2025లో ప్రతీ ఐదుగురిలో ఒక్కరి ఆదాయం మాత్రమే పెరగనుందని తమ సర్వేలో వెల్లడయ్యిందని లోకల్ సర్కిల్స్ తెలిపింది. కుటుంబాల ఆదాయాలపై 16,111 మందిని సర్వే చేసి ఓ రిపోర్ట్‌ను తయారు చేసినట్లు వెల్లడించింది. 2025లో తమ పొదుపు 25 శాతం వరకు తగ్గొచ్చని 48 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. తమ పొదుపు పెరగొచ్చని 27 శాతం మంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కనీసం వచ్చే బడ్జెట్‌లో అయినా తమకు ప్రోత్సాహకాలు అందించేలా కేంద్రం చొరవ తీసుకోవాలని మెజారిటీ ప్రజలు కోరినట్లు లోకల్ సర్కిల్స్ పేర్కొంది.