న్యూఢిల్లీ : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ జాగ్వర్ లాండ్ రోవర్ తన డిఫెండర్ జర్నీ మూడో ఎడిషన్‌ను ప్రారంభించినట్లు తెలిపింది. ఇందులో పాల్గొనే క్లయింట్లకు విలాసవంతమైన బస, ఆతిథ్యం అందించబడుతుందని పేర్కొంది. థార్ ఎడారి, జన్‌స్కార్ వ్యాలీ, ఉమ్లింగ్ లా పాస్, లద్దాఖ్ రీజియన్, స్పిటీ వ్యాలీ, కొంకణ్ రీజియన్ లాంటి కీలక ప్రదేశాల్లో ఈ సారి జర్నీ సాగనుందని ఆ సంస్థ తెలిపింది. తమ తొలి రెండు సీజన్లలో 420 మంది క్లయింట్లు ఉత్సాహాంగా పాల్గొన్నారని జెఎల్‌ఆర్ ఇండియా ఎండి రాజన్ అంబ పేర్కొన్నారు.