మూడు రెట్లు పెరిగిన దొంగ నోట్లు

Nov 28,2024 01:50 #Business, #fake notes

న్యూఢిల్లీ : భారత్‌లో పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా దొంగ నోట్లను కట్టడి చేయడంతో పాటుగా దేశ, విదేశాల్లోని నల్లధనాన్ని వెలికితీస్తామని బీరాలు పలికిన ప్రధాని నరేంద్ర మోడీ ఆచరణలో ఘోరంగా విఫలమయ్యారు. కనీసం నకిలీ నోట్లను కూడా అరికట్టలేక మోడీ సర్కార్‌ చేతులెత్తేసింది. మూడేళ్లలో దొంగనోట్లు మూడు రెట్లు పెరిగిపో యాయి. 2018-19 నుంచి 2022-23 వరకు నకిలీ రూ.500 నోట్లు 317 శాతం పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2018-19లో రూ.500 విలువ కలిగిన మొత్తం 2186.5 కోట్ల నకిలీ నోట్లను గుర్తించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. దీంతో పోల్చితే 2022-23లో ఏకంగా 9,111 కోట్ల దొంగ నోట్లు బయటపడ్డాయన్నారు. వీటిలో 316.6 శాతం పెరుగుదల చోటు చేసుకున్నట్లయ్యిందన్నారు. 2023-24లో రూ.500 నకిలీ నోట్ల సంఖ్య 85,711గా నమోదయిందన్నారు. 2018-19లో 2,184 కోట్ల రూ.2 వేల నకిలి కరెన్సీ గుర్తించగా, 2022-23లో రూ.980 కోట్లు నకిలీ పెద్ద నోట్లు బయటపడ్డాయి. 2023-24లో ఏకంగా 2,603.5 కోట్ల నకిలీనోట్లు ఉన్నట్లు గుర్తించారు. ఆర్‌బిఐ గణంకాల ప్రకారం.. 2024 మార్చి ముగింపు నాటికి మొత్తం కరెన్సీలో రూ.500 నోట్ల వాటా 86.5 శాతంగా ఉంది. గతేడాది ఇదే సమయానికి 77.1 శాతంగా ఉంది. గతేడా ది మేలో రూ.2వేల నోట్లను ఉపసంహరించుకోవడం ద్వారా రూ.500 నోట్లు ఎక్కువగా చలామణిలోకి వచ్చాయి.

➡️