రేపు మొండి బాకీల పరిష్కారానికి సదావకాశం

Jun 10,2024 21:07 #Business
  • బిఒఐ ‘వన్‌ టైం సెటిల్‌మెంట్‌’ పథకం

ప్రజాశక్తి – విజయవాడ : రుణగ్రహీతల మొండి బకాయి ఋణ ఖాతాలను పరిష్కరించుకోవడానికి జూన్‌ 12న సదావకాశం కల్పిస్తున్నట్టు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బిఒఐ) తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ అన్నీ బిఒఐ శాఖలు, జోన్లలో సంఝౌత దినోత్సవాన్ని నిర్వహిస్తోన్నట్లు ఆ బ్యాంక్‌ విజయవాడ జోన్‌ చీఫ్‌ మేనేజర్‌ (రికవరీ) పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది. ఏదైనా నిజమైన కారణం వల్ల సకాలంలో రుణాన్ని తిరిగి చెల్లించలేని మొండి బకాయి రుణగ్రహీతల కోసం సంఝౌత దినం ప్రత్యేకంగా రూపొందించబడిందని తెలిపింది.. చిన్న ఖాతాలు, మధ్యస్థ ఖాతాలను పరిష్కరించడానికి తమ బ్యాంక్‌ వన్‌ టైం సెటిల్‌మెంట్‌ (ఒటిఎస్‌) ప్రత్యేక పథకాన్ని కలిగి ఉందని వెల్లడించింది. దీంతో మొండి బకాయి ఖాతాలు ఉన్న రుణగ్రహీతలకు ప్రత్యేక డిస్కౌంట్లను అందిస్తుందని తెలిపింది. ఈ సువర్ణావకాశాన్ని వినియోగించుకోవాలని మొండి బకాయి ఖాతాలు ఉన్న రుణగ్రహీతలందరికి విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొంది.

➡️