మార్కెట్లోకి టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ టేసర్‌

Apr 3,2024 21:15 #Business

బెంగళూరు : ప్రీమియం కార్ల తయారీ కంపెనీ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టికెఎం) బుధవారం భారత మార్కెట్లోకి తన కొత్త అర్బన్‌ క్రూయిజర్‌ టేసర్‌ను విడుదల చేసింది. టేసర్‌ ప్రారంభ ధర రూ.7.73 లక్షలుగా, హైఎండ్‌ మోడల్‌ ధరను రూ.13.03 లక్షలుగా నిర్ణయించింది. 1.0 లీటర్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌, 1.2 లీటర్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో రెండు వేరియంట్లలో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. సిఎన్‌జి వర్షన్‌లోనూ లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తమకు భారత మార్కెట్‌ చాలా ముఖ్యమైందని టికెఎం డిప్యూటి మేనేజింగ్‌ డైరెక్టర్‌ తదాషి అసజుమా పేర్కొన్నారు. బుకింగ్స్‌ తెరిచామని.. మే నుంచి డెలివరీ చేయనున్నామన్నారు. దిగ్గజ వాహన కంపెనీలు మారుతీ, టయోటా భాగస్వామ్యంలో 6వ మోడల్‌ కావడం విశేషం.

➡️