బెంగళూరు : కమ్యూనికేషన్స్ వేదిక ట్రూకాలర్ ఫీచర్ ఇకపై ఐఫోన్‌లోనూ అందుబాటులోకి వచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది. దీంతో స్పామ్, స్కామ్ బ్లాకింగ్ సామర్థ్యాలను ఐఫోన్ వినియోగదారులకు అందించనున్నట్లు ట్రూకాలర్ వెల్లడించింది. అన్ని రకాల కాల్స్‌ను గుర్తించే సామర్థ్యం లభించనుందని పేర్కొంది. ట్రూకాలర్ 15 సంవత్సరాలుగా అవాంఛనీయ కమ్యూనికేషన్ ఫిల్టర్ చేసే టెక్నాలజీలో ఉంది. స్పామ్ కాల్స్ ఆటోమాటిక్ బ్లాకింగ్ సదుపాయాలను కల్పిస్తుందని ట్రూకాలర్ సిఇఒ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా పేర్కొన్నారు. ఐఫోన్‌లోనూ ట్రూకాలర్‌ను అందుబాటులోకి తేవడంపై సంతోషంగా ఉందన్నారు.
