ట్రంప్‌ టారీఫ్‌లతో బ్రిక్స్‌ దేశాలకు ముప్పు

  • ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి

హైదరాబాద్‌ : అమెరికా డాలర్‌కు దూరంగా ఉంటే బ్రిక్స్‌ దేశాలు 100 శాతం టారిఫ్‌లను ఎదుర్కోవాల్సి వస్తుందని అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన హెచ్చరికను ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు విమర్శించారు. ఈ పరిణామం బ్రిక్స్‌ దేశాలకు ముప్పులాంటిందన్నారు. ఆర్థిక సవాళ్ల కారణంగా దాని సాధ్యత, చట్టబద్ధతపై మరింత స్పష్టత రావాల్సి ఉందన్నారు. ట్రంప్‌ టారీఫ్‌ విధానానికి అమెరికా చట్టం అనుమతిస్తుందో లేదో చూడాలన్నారు. యుఎస్‌ డాలర్‌కు ప్రత్యామ్నాయాన్ని తీసుకురావడంలో బ్రిక్స్‌ దేశాల్లో అంతర్గత విభేదాలు ఉన్నాయన్నారు. భారత్‌, రష్యా, చైనా, బ్రెజిల్‌లను కలిగి ఉన్న తొమ్మిది సభ్య దేశాలు అమెరికా కరెన్సీ ప్రత్యామ్యాయానికి చొరవ తీసుకోవాలన్నారు. బ్రిక్స్‌లోని కీలక దేశాలు రష్యా, చైనా కొన్ని రోజులుగా ప్రత్యామ్నాయాన్ని కోరుతున్నాయన్నారు. భారత్‌ ఇప్పటి వరకు ఈ చర్యలో భాగం కాలేదన్నారు.

➡️