యుపిఐ సేవల్లో అంతరాయం

Apr 12,2025 21:17 #upi

న్యూఢిల్లీ : డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ యుపిఐల్లో మరోమారు అంతరాయం చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా ఈ సేవలు స్తబించడంతో పలు చెల్లింపులు నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. శనివారం మధ్యాహ్నాం 12 గంటల సమయంలో గూగుల్‌ పే, ఫోన్‌పే, పేటియం, ఇతర థర్డ్‌ పార్టీ యాప్స్‌ పని చేయలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో వేలాది మంది నెటిజన్లు తన నిరసన, అసహనంను వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్య వల్ల చెల్లింపుల్లో అవాంతరం చోటు చేసుకుందని ఎన్‌పిసిఐ తెలిపింది. దీన్ని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఇంతక్రితం మార్చి 26న, ఏప్రిల్‌ 2న కూడా యుపిఐ చెల్లింపుల్లో అంతరాయం చోటు చేసుకుంది.

➡️