ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నారాయణ మూర్తి
ముంబయి : ఇన్ఫోసిస్ కో ఫౌండర్ ఎన్‌ఆర్ నారాయణమూర్తి మరోసారి నోరు పారేసు కున్నారు. వారానికి 90 గంటలు పని చేయాలని ఇటీవల వ్యాఖ్యలు చేసి తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకొని అబాసు పాలైన ఆయన.. తాజాగా ఉచితాలు నిరుపయోగమని అన్నారు. ముంబయి లో జరిగిన ‘టైకాన్ ముంబయి 2025’లో నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సృష్టించే ఉద్యోగాలతో పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందన్నారు. కానీ ప్రజలకు పంచే ఉచితాలతో ఉపయోగం ఉండదన్నారు. ఔత్సాహికవేత్తలు మరిన్ని వ్యాపారాల సృష్టిపై దృష్టి సారించాలన్నారు. వినూత్న కంపెనీలు ఏర్పాటు చేస్తే ఏదో ఒక రోజు పేదరికం మాయమవుతుందన్నారు. ఏ దేశమూ పేదలకు ఉచితాలు ఇవ్వడం వల్ల విజయవంతం కాలేదన్నారు. ఉద్యోగాల వల్లే పేదరిక సమస్య పరిష్కారమవుతుందన్నారు.