వచ్చే వారమూ మార్కెట్లలో అప్రమత్తత..!

Jan 11,2025 23:25 #Business, #Markets, #next week.., #vigilance

ముంబయి : వచ్చే వారమూ మార్కెట్లలో ఒడిదుడుకులు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గడిచిన వారంలో ఐదు సెషన్లలోనూ మార్కెట్లు బలహీనంగా నమోదయ్యాయి. భారీ నష్టాలతో మదుపర్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అంతర్జాతీయంగా కొనసాగుతున్న బలహీన పరిణామాలకు తోడు భారత మార్కెట్ల నుంచి కొనసాగుతున్న విదేశీ సంస్థాగత పెట్టుబడులు తరలిపోవడంతో గత కొన్ని సెషన్లుగా సూచీలు నష్టాలు చవి చూస్తున్నాయి. మరోవైపు దేశ ఆర్ధిక వ్యవస్థలో కొనసాగుతున్న బలహీనతలు మదుపర్లను విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. గత వారం చివరి మూడు సెషన్లలో భారీ నష్టాలతో మదుపర్లు రూ.12 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. చమురు ధరలు పెరగడం, డాలర్‌కు డిమాండ్‌ పెరగడం, రూపాయి పతనం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. వరుస నష్టాల నేపథ్యంలో వచ్చే వారం మార్కెట్ల పట్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

➡️