రెండేళ్లలో మరో 25 ఔట్‌లెట్‌లు తెరుస్తాం

  • ఐస్‌బర్గ్‌ సిఇఒ సుహాస్‌ బి శెట్టి వెల్లడి

ప్రజాశక్తి – హైదరాబాద్‌ : ఆర్గానిక్‌ ఐస్‌క్రీం బ్రాండ్‌ ఐస్‌బర్గ్‌ వచ్చే రెండేళ్లలో మరో 25 కొత్త ఔట్‌లెట్‌లు తెరువాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐస్‌బర్గ్‌ వ్యవస్థాపకులు, సిఇఒ సుహాస్‌ బి శెట్టి మాట్లాడుతూ.. అతి త్వరలోనే తమ 73 అవుట్‌లెట్‌ను నగరంలోని కావూరి హిల్స్‌లో ప్రారంభించనున్నామన్నారు. ఇందుకోసం రూ.70 లక్షలు వ్యయం చేస్తున్నామన్నారు. 2013లో నెల్లూరులో తొలుత 200 చదురపు అడుగుల విస్తీర్ణంలో తమ వ్యాపారం మొదలయ్యిందన్నారు. ప్రస్తుతం 64 ఫ్రాంచైజీ, 8 కంపెనీ సొంత అవుట్‌లెట్‌లను కలిగి ఉన్నామన్నారు. త్వరలోనే 9వ స్టోర్‌ జత కానుందన్నారు. కొత్త అవుట్‌లెట్‌ల కోసం రూ.11 కోట్ల పెట్టుబడులకు సిద్దంగా ఉన్నామన్నారు. 2025-26లో రూ.100 కోట్ల టర్నోవర్‌కు చేరాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

➡️