బెంగళూరు : ప్రముఖ ఐటి సేవల కంపెనీ విప్రో ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో 26 శాతం వృద్ధితో రూ.3,570 కోట్ల నికర లాభాలు సాధించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ4లో రూ.2,835 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.22,208 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన త్రైమాసికంలో 1 శాతం పెరిగి రూ.22,504 కోట్లకు చేరింది. 2024-25లో స్థూలంగా రూ.89,090 కోట్ల ఆదాయంతో రూ.13,140 నికర లాభాలు సాధించినట్లు వెల్లడించింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో మెగా డీల్స్‌ను సాధించామని విప్రో సిఇఒ, ఎండి శ్రీని పలియా పేర్కొన్నారు. క్లయింట్ సంతృప్తి స్కోర్ పెరిగిందన్నారు.
