షావోమి ఇండియా ప్రెసిడెంట్‌ మురళీ కృష్ణన్‌ రాజీనామా

న్యూఢిల్లీ : దిగ్గజ స్మార్ట్‌ఫోన్ల కంపెనీ షావోమి ఇండియా ప్రెసిడెంట్‌ బి మురళీకృష్ణన్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ ఏడాది చివరి వరకు అధ్యక్ష హోదా నుంచి తప్పుకుంటారని ఆ కంపెనీ మంగళవారం వెల్లడించింది. ఆరేళ్లు పైగా షావోమిలో పని చేసిన ఆయన అకడమిక్‌ రీసెర్చ్‌ వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మేనేజ్‌మెంట్‌లో డాక్టరేట్‌ పట్టా అందుకోవాలని భావిస్తున్నారు. ‘టెక్నాలజీ ప్లాట్‌ఫామ్స్‌పై కన్జూమర్‌ బిహేవియర్‌’ అనే అంశంపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.

➡️