మార్కెట్‌లోకి షావోమీ రెడ్‌మీ 14సి 5జి

  • ప్రారంభ ధర రూ.9,999

ప్రజాశక్తి – హైదరాబాద్‌ : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ షావోమి కొత్తగా రెడ్‌మీ 14సి 5జిని విడుదల చేసింది. బుధవారం హైదరాబాద్‌లో దీనిని ఆ కంపెనీ ప్రతినిధి సందీప్‌ శర్మ ఆవిష్కరించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను జనవరి 10న ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంచనున్నామని చెప్పారు. భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ల వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ ఇప్పటివరకూ కేవలం 16 శాతం మంది వినియోగదారులు మాత్రమే 5జి ఫోన్లు కలిగి ఉన్నారని తెలిపారు. ఈ విభాగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు. 50 ఎంపి ఏఐ-డ్యుయల్‌ కెమెరాతో పాటు 8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి తెచ్చామన్నారు. 4జిబి ర్యామ్‌, 64జిబి స్టోరేజీ కలిగగిన ప్రాథమిక మోడల్‌ ధరను రూ.9,999గా, 6 జిబి మెమరీ, 128జిబి స్టోరేజీ ఉన్న ఫోన్‌ ధరను రూ.11,999గా నిర్ణయించామన్నారు.

➡️