
-రూ 170 కోట్ల ప్రాజెక్టును ఖరారు చేసిన రైల్వే శాఖ
న్యూఢిల్లీ : వందేభారత్ రైళ్ల కోసం 39 వేల రైల్వే చక్రాలను సరఫరా చేసే కాంట్రాక్ట్‌ను ఒక చైనా సంస్థకు కేంద్ర ప్రభుత్వం అప్పగించడం విశేషంగా మారింది. రష్యాాఉక్రెయిన్ మధ్య ఉద్రికత్తల కారణంగా ఇతర దేశాల నుంచి సరఫరాలు నిలిచిపోవడంతో చైనా సంస్థకు ఈ కాంట్రాక్ట్‌ను ఖరారు చేసినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అయితే గాల్వాలోయలో ఘర్షణ తరువాత ఉద్రిక్తతలు నెలకున్న నేపథ్యంలో గత ఏడాది జులైలో చైనా నుంచి పెట్టుబడులు, సరఫరాల విషయంలో కేంద్ర పరిమితులు విధించింది. అయినా ఈ ప్రాజెక్టును చైనా సంస్థకు అప్పగించడం విశేషం. రూ.170 కోట్ల విలువైన ఈ కాంట్రాక్ట్‌కోసం ఏప్రిల్ 4న టెండర్లు ప్రారంభించగా, ఈ నెల 2న టెండరు ఖరారు చేశారు. టిజి (తైజాంగ్) హంకాంగ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే చైనా ప్రభుత్వ సంస్థకు ఈ కాంట్రాక్ట్ లభించింది. ' ఈ రైళ్ల చక్రాల ప్రాజెక్టు వందేభారత్ ట్రైన్ల కోసం ఉద్దేశించింది. రష్యాాఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇతర దేశాల నుంచి సరఫరా నిలిచిపోవడంతో చైనా సంస్థకు కాంట్రాక్ట్ ఇస్తూ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది' అని రైల్వే శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. టెండర్‌ను జారీ చేస్తూ రైల్వే బోర్డు ఇచ్చిన ఉత్తర్వులు ప్రకారం టిజి (తైజాంగ్) హంకాంగ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనే చైనా ప్రభుత్వ సంస్థకు ఈ కాంట్రాక్ట్ లభించగా.. చైనాలోని షాంగై రాష్ట్రంలోని తైయువాన్ నగరంలోని తైయువాన్ హెవీ ఇండిస్టీ రైల్వే ట్రాన్సిట్ ఎక్విప్మెంట్ కంపెనీలో చక్రాలను తయారు చేస్తారు. టిజి (తైజాంగ్) హంకాంగ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది తైయూన్ హెవీ మిషనరీ గ్రూప్ కో లిమిటెడ్‌కు చెందిన అంతర్జాతీయ వ్యాపార విభాగం. తైయూన్ హెవీ మిషనరీ గ్రూప్ కో లిమిటెడ్‌ను 1950లో స్థాపించారు. చైనాతో ఉద్రికత్తలు ఉన్నా రైళ చక్రాల కాంట్రాక్ట్‌ను ఆ దేశానికి చెందిన సంస్థకు ఖరారు చేయడం ఒక విశేషం అయితే, మేకిన్ ఇండియా పేరుతో స్వదేశంలోనే తయారినీ అభివృద్ది చేస్తామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు ప్రారంభించకుండా రైళ్ల చక్రాల సరఫరా ప్రాజెక్టును చైనా సంస్థకు అప్పగించడం మరో విశేషం. దేశంలో మొట్టమొదటి స్వదేశీ సెమీాహైాస్పీడ్ రైలు వందేభారత్‌ను 2019లో ప్రారంభించారు. న్యూఢిల్లీాకాన్పూర్ా అలహాబాద్ావారణాసి మార్గంలో ఈ వందే భారత్ రైలును తొలిసారిగా ప్రారంభించారు. అనేక ఇతర ప్రముఖ మార్గాల్లోనూ ఈ రైలును నడపనున్నారు.