Feb 06,2023 23:24

పిహెచ్‌సి నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న డిప్యూటీ సిఎం బూడి

ప్రజాశక్తి-కె.కోటపాడు
మండలంలోని అతిపెద్ద చౌడువాడ పంచాయతీని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు పేర్కొన్నారు. సోమవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చౌడువాడతో పాటు గరుగుబిల్లిలో ఆయన పర్యటించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నట్లు చెప్పారు. విశాఖ రాజధానితో గ్రామాలకు మహర్దశ పడుతుందన్నారు. అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. చిన్నారులకు అందుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. చౌడువాడలో కోటి 70 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి జగన్మోహన్‌, శివాజీ రాజు, ఎంపీటీసీలు రొంగలి సూర్యనారాయణ, ఏటుకూరు రాజేష్‌, ఆర్‌ అండ్‌ బి డిఈ విద్యాసాగర్‌, ఏఈ జ్ఞానేశ్వర్రావు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.