Mar 19,2023 22:25

పోలీస్‌స్టేషన్‌లో భద్రపరుస్తున్న అధికారులు

ప్రజాశక్తి- పొందూరు: ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాయి. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రెండు, ఎపి మోడల్‌ స్కూల్‌, తాడివలస జెడ్‌పి హెచ్‌ఎస్‌లోని పరీక్షా కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలను పోలీస్‌స్టేషన్‌లో భద్రపరిచినట్లు ఎంఇఒ పి.వి.రామరాజు, కస్టోడియన్‌, జాయింట్‌ కస్టోడియన్లు వై.అరుణకుమారి, పూజారి హరిప్రసన్న తెలిపారు. కార్యక్రమంలో ఛీప్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ ఆఫీసర్లు పట్నాన రాజారావు, కుప్పిలి రవికుమార్‌, సత్యనారాయణ, పూజారి రవి పాల్గొన్నారు.