May 26,2023 01:49
మార్టును ప్రారంభిస్తున్న ఎంపీ మోపిదేవి

ప్రజాశక్తి-రేపల్లె: మహిళల ఆర్థిక అభివృద్ధికి చేయూత మహిళా మార్టులు దోహదపడతాయని ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు అన్నారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలనే ఆశయంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి పలు సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టారని ఎంపీ మోపిదేవి వెంకట రమణరావు తెలిపారు. పట్టణంలోని ఓపెన్‌ థియేటర్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేయూత మహిళ మార్టును గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించాలని లక్ష్యంతో మార్టులను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్టులో నిత్యావసర సరుకులను కొనుగోలు చేసి వారి ఆర్థికాభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బాపట్ల అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ చైర్మన్‌ దేవినేని మల్లిఖార్జునరావు, పట్టణ అధ్యకులు గడ్డం రాధాకృష్ణమూర్తి, రూరల్‌ మండల అధ్యక్షులు గాదె వెంకయ్య బాబు, ఆర్డిఓ జగన్నాథం పార్థసారథి, తహశీల్దారు మల్లికార్జునరావు, వైసీపీ నాయకులు, డ్వాక్రా మహిళలు పాల్గొన్నారు.