Aug 06,2022 23:32

చెరువు పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి తదితరులు

ప్రజాశక్తి-సబ్బవరం
అమృత్‌ సరోవర్‌ కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ఉపాధి హామీ నిధులతో మండలంలోని బాటజంగాలపాలెం పంచాయతీ పరిధిలోని చేపడుతున్న చిక్కాలవాని చెరువు అభివృద్ధి పనులను అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి పఠాన్‌శెట్టి శనివారం పరిశీలించారు. అక్కడ పని చేస్తున్న 350 మంది కూలీలతో మాట్లాడి కూలి రేటు గిట్టుబాటు అవుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఆగష్టు15 నాడు చెరువు గట్టుపై జాతీయపతాకం ఎగురవేయాలని అధికారులను ఆదేశించారు. చెరువు ఎత్తు చేయాలని, ఆయకట్టు రైతులకు సాగునీరు సక్రమంగా అందేటట్లు చేయాలని గ్రామ సర్పంచ్‌ పడాల వెంకటరమణ కోరారు. ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ పీడీ పూర్ణిమాదేవి మాట్లాడుతూ చెరువు పనులు రూ.21లక్షలతో చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎపిఓ శ్రీనివాసరావు, నారపాడు సర్పంచ్‌ మామిడి శంకరరావు, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ పరమేష్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సన్యాసిరావు, కార్యదర్శి పాల్గొన్నారు.