Nov 29,2021 23:28

ఫొటో : పరిశీలిస్తున్న అధికారులు

ఫొటో : పరిశీలిస్తున్న అధికారులు
చెరువులను పరిశీలించిన ఆర్‌డిఒ
ప్రజాశక్తి దగదర్తి : మండలంలోని లింగాలపాడు, మనుబోలుపాడు, కాట్రయపాడు, దుండిగం గ్రామాల్లో చెరువులను కావలి ఆర్‌డిఒ శీనానాయక్‌ సోమవారం పరిశీలించారు. అనంతరం మనుబోలుపాడు చెరువు కలుజు ఉధృతంగా రోడ్డుపై ప్రవహించే దృశ్యాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని చెరువులు నిండి ఉన్నాయని ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియదు కాబట్టి ఇరిగేషన్‌ అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ పరిశీలించాలన్నారు.
మనుబోలు పాడు చెరువు కలుజు రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తున్నతో ప్రయాణికుల్ని ప్రజలు అటువైపు ఎవరు పోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని అవసరమైతే పోలీసులను ఏర్పాటు చేసి సూచించారు. మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అత్యవసరం తప్ప మిగతా సమయంలో బయటికి ఎవరు రాకూడదని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్‌ ప్రమీల, ఇరిగేషన్‌ ఎఇ హరీష్‌రావు, ఆర్‌ఐ సుధా, విఆర్‌ఒ గౌతమ్‌, విఆర్‌ఎలు, ప్రజలు పాల్గొన్నారు.