Jan 19,2022 08:56

ఖమ్మం : చెట్టు కూలి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన మంగళవారం సాయంత్రం ఖమ్మంలోని బ్రాహ్మణ బజారులో చోటు చేసుకుంది. స్థానిక వివరాల మేరకు ... నిన్న సాయంత్రం ఆరుగురు చిన్నారులు బ్రాహ్మణ బజారులోని ఓ ఖాళీ స్థలంలో ఆడుకోవడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్న భారీ చెట్టు పక్కనున్న గోడపై కూలింది. దీంతో గోడ కిందపడి దిగాంత్‌ శెట్టి (11), రాజ్‌పుత్‌ ఆయుష్‌ (6) మృతి చెందారు. మరో ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ప్రమాదంలో గాయపడిన ముగ్గురు చిన్నారులను ఖమ్మంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని మేయర్‌ నీరజ, ఏఈ నర్సయ్య, అగ్నిమాపక అధికారులు పరిశీలించి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.