Jan 16,2021 10:26

తూర్పు గోదావరి (కాకినాడ) : తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం కందాలపాలెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కారు వేగంగా వెళ్లి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.