Feb 23,2021 08:54

గుంటూరు (వినుకొండ) : గుంటూరు జిల్లా వినుకొండ మండలం కొత్తపాలెం సమీపంలోని శివాపురం వద్ద ట్రాలీ ఆటో అదుపు తప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందగా.. సుమారు 20 మందికి పైగా కూలీలు గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను 108 సహాయంతో ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతులు, క్షతగాత్రులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన వారుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.