
ప్రజాశక్తి - నరసరావుపేట : పట్టణంలో శుక్రవారం నిర్వహించే గోపూజ మహోత్సవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరుకా నున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్, జిల్లా రూరల్ ఎస్పీ విశాల్ గున్ని, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బుధవారం పరిశీలించారు. అనంతరం స్థానిక సత్తెనపల్లి రోడ్డులోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంలో అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ అధికార యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలని, చిన్న పొరపాటుకైనా అవకాశం ఇవ్వొద్దని చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రూరల్ ఎస్పీ మాట్లాడుతూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తామని, నరసరావు పేటలో, పట్టణానికి అన్నివైపులా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టా లని చెప్పారు. సమావేశంలో జెసి దినేష్‌కు మార్, సబ్ కలెక్టర్ శ్రీవాస్‌నుపూర్ అజరు కుమార్ పాల్గొన్నారు.