
చిన్నారిని ఆశీర్వదిస్తున్న మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి
ప్రజాశక్తి-కురిచేడు : కురిచేడుకు చెందిన వైసిపి కార్యకర్తల మానేపల్లి వరకుమార్ కుమార్తె పుష్పాలంకరణ వేడుకలు గురువారం నిర్వహించారు. ఈ వేడుకల్లో దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. అనంతరం ఇటీవల అనార్యోగానికి గురైన మండల పరిధిలోని పడమర వీరాయపాలెం మాజీ సర్పంచి రావిపాటి శ్రీనివాసులును పరామ ర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిటిసి నుసుం వెంకట నాగిరెడ్డి, మాజీ ఎంపిపి వీరగంధం కోటయ్య, వైసిపి మండల నాయకులు నుసుం ప్రతాపరెడ్డి, నుసుం నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.