Jan 15,2022 15:57

హైదరాబాద్‌ : సినిమా టికెట్ల ధరలపై మెగాస్టార్‌ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని రెండు రోజుల క్రితం కలిసి సమస్యపై సుమారు గంటన్నరపాటు చర్చించారన్న విషయం తెలిసిందే. అయితే చిరంజీవి, జగన్మోహన్‌రెడ్డిని కలవడంపై అటు సినీ వర్గాల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ సర్వత్రా చర్చ మొదలైంది. చిరంజీవి మళ్లీ రాజకీయ ప్రవేశం చేయనున్నారా? వైఎస్సార్‌సిపి పార్టీలో చేరనున్నారా? అనే విషయాలపై ప్రధానంగా చర్చ నడుస్తోంది. అయితే తాజాగా చిరు, ఏపీ సిఎం భేటీపై అక్కినేని నాగార్జున మరోసారి స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కాగా, సంక్రాంతి పండుగ సందర్భంగా నాగార్జున, నాగచైన్య కలిసి నటించిన 'బంగార్రాజు' మూవీ జనవరి 14 (శుక్రవారం) విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకాదరణ పొందుతూ.. హిట్‌వైపు దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్‌తో నాగార్జున మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నాగార్జున చిరు భేటీపై మాట్లాడుతూ... 'చిరంజీవి వెళ్లారంటే టికెట్‌ రేట్లపై తప్పకుండా హ్యాపీ ఎండిగ్‌ వస్తుంది' అని ఆయన అన్నారు.