Nov 24,2021 18:37

యాంకర్‌ రష్మి చేతికందిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ నటిగా గుర్తింపు తెచ్చుకుంటుంది. మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'భోళా శంకర్‌' చిత్రంలో రష్మికి అవకాశం వచ్చింది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మి కూడా నటిస్తుందని చిత్రబృందం ప్రకటించింది. అయితే సినిమాలో మాస్‌ డ్యాన్స్‌ ఉంటే బాగుంటుందని.. అందులోనూ చిరు డ్యాన్స్‌ చేస్తే బాగుంటుందని భావించిన చిత్రబృందం ఈ మేరకు సంగీత దర్శకుడితో కలిసి ఓ మాస్‌ సాంగ్‌కి సన్నాహాలు చేస్తోంది. ఆ పాటలో చిరుతో కలిసి రష్మి స్టెప్పులేయనున్నారని సమాచారం. శేఖర్‌ మాస్టర్‌ ఈ పాటకు కొరియోగ్రఫీ చేయనున్నారు.