
ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
పట్టణానికి చెందిన చిరువ్యాపారి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. పట్టణంలోని జగ్జీవన్‌నగర్‌కు చెందిన దర్శిపాము ఆంజనేయులు(35) ఏలూరు రోడ్ జీడి గింజల ఫ్యాక్టరీ సమీపంలో రోడ్డపక్కన పనసకాయల వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో తన దుకాణంలోనే తాడుకు వేలాడుతూ మృతిచెంది పడిఉన్నాడు. ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ సాగర్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.