
ప్రజాశక్తి -జరుగుల్లి : రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రతి రైతు కుటుంబానికి అన్నదాత పథకం ఏడాదికి రూ.20 వేల ఆర్థిక సాయం అందిస్తామని మేనిపెస్టో ప్రకటించడాన్ని హర్షిస్తూ చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. టిడిపి మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ప్రధాన కార్యదర్శి నరాల సోమయ్య, టిడిపి యూత్ అధ్యక్షుడు ఎనిమిరెడ్డి రమేష్‌రెడ్డి, తెలుగు రైతు అధ్యక్షుడు దగ్గుమాటి సుబ్బారెడ్డి, వట్టిగుంట శివాజీ, స్వర్ణా బ్రహ్మయ్య, గుండపనేని వెంకటేశ్వర్లు, బలరామిరెడ్డి పాల్గొన్నారు. శింగరాయకొండ : మండల తెలుగు రైతు అధ్యక్షుడు బైరపనేని మోహన్ రావు ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహిం చారు. అనంతరం కందుకూరులోనున్న నందమూరి తారక రామారావు, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు పూలమాలవేసి నివాళులర్పించి. ఈ కార్యక్రమంలో నాయకులు వేల్పుల సింగయ్య, చీమకుర్తి కష్ణ ,కూనపురెడ్డి వెంకట సుబ్బారావు , మించల బ్రహ్మయ్య , పులి ప్రసాదు ,పులి మాలకొండయ్య పాల్గొన్నారు. కొండపి : రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో రైతుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోను హర్షిస్తూ టిడిపి నాయకుడు ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌టిసి కూడలి వద్ద ఉన్న ఎన్‌టిఆర్, దామచర్ల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు బి.యలమందనాయుడు, తిప్పారెడ్డి కృష్ణారెడ్డి, నరసారెడ్డి, బత్తుల నారాయణస్వామి, వసంతరావు పాల్గొన్నారు.