Jun 02,2023 23:26

చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి- జరుగుమల్లి -  రాజమహేంద్రవరంలో నిర్వహించిన మహానాడులో యువగళం పథకం ద్వారా నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు కల్పన, యువగళం నిధి నుంచి నిరుద్యోగులకు రూ.3వేల నిరుద్యోగ భృతి ప్రకటిస్తూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మేనిఫెస్టో విడుదల చేశారు. అందులో భాగంగా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. మండల పరిధిలోని కామేపల్లి గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు టిడిపి మండల అధ్యక్షుడు పోకూరి రవీంద్రబాబు అధ్యక్షతన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చంద్రబాబు నాయుడు చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి గ్రామ మాజీ సర్పంచి ఏలూరి రాంబాబు, తెలుగు యువత అధ్యక్షుడు ఎనిమిరెడ్డి రమేష్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి నరాల సోమయ్య, కొమ్మాలపాటి కృష్ణ, రావి నాగేశ్వరరావు, చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, దగ్గుమాటి సుబ్బారెడ్డి, బత్తిన పూర్ణ చంద్రరావు, కట్టా మణికుమార్‌, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు పొన్నలూరు : యువత భవిష్యత్తు టిడిపితోనే సాధ్యమని తెలుగు యువత మండల అధ్యక్షుడు బోయపాటి రమణారెడ్డి తెలిపారు. ఇటీవల రాజమహేంద్ర వరంలో నిర్వహించిన మహానాడులో యువగళం పథకం ద్వారా నిరుద్యోగులకు చంద్రబాబునాయుడు వరాల జల్లు కురిపించడాన్ని హర్షిస్తూ చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మాజీ అధ్యక్షులు మండవ ప్రసాద్‌, పిల్లి వెంకటనారాయణరెడ్డి, ఎంపిటిసి రామాంజనేయులు, బీసీసెల్‌ అధ్యక్షుడు కుర్రా మాల్యాద్రి, రైతు అధ్యక్షుడు కుంకు సురేష్‌, దాసరి కష్ణారావు, టిడిపి నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్‌ నేలపాటి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. శింగరాయకొండ : యువతకు ఉపాధి కల్పిస్తూ ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయకుడు విడుదల చేసి మేనిఫెస్టోను హర్షిస్తూ తెలుగు యువత అధ్యక్షుడు షేక్‌ సనావుల్లా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల్పుల సింగయ్య, చీమకుర్తి కష్ణ ,కూనపురెడ్డి వెంకటసుబ్బారావు, మించాల బ్రహ్మయ్య, సన్నెబోయిన శ్రీనివాసులు నాయుడు, షేక్‌ అబ్దుల్‌ సుబాహన్‌ , షేక్‌ యస్‌ధాని, ఇమ్మడిశెట్టి రామారావు, కల్లగుంట నరసింహ, ఓలేటి రవిశంకర్‌ రెడ్డి ,కనిగిరి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.