Apr 20,2021 21:42

hanumanjuntion lo

చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు
నందిగామ : పట్టణ టిడిపి కమిటీ ఆధ్వర్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు యేచూరి రాము, నందిగామ మండల అధ్యక్షుడు వీరంకి వీరాస్వామి,పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కంచికచర్ల: స్థానిక టిడిపి కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు కోగంటి బాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. భారీ కేకును కోగంటి బాబు చేతుల మీదుగా కట్‌ చేశారు. టిడిపి మండల అధ్యక్షులు కోగంటి బాబు మాట్లాడారు. సీనియర్‌ టిడిపి నాయకులు కుంటముక్కల శ్రీధర్‌, అన్నదాత రామకష్ణ, తేలప్రోలు రమణయ్య, గుత్తా రత్నం, మాజీ వైస్‌ ఎంపీపీ అల్లాడి కోటేశ్వరరావు, టౌన్‌ పార్టీ అధ్యక్షులు వేమ వెంకట్రావు, గొర్రెపాటి ప్రభాకరరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు రొంపిచర్ల శ్యామ్‌, జి.నరేష్‌, పంచాయతీ వార్డు సభ్యులు గుత్తా ఓంకార్‌, గూడవల్లి గణేష్‌, మాజీ వార్డు సభ్యులు నల్లనాగులు, అరుణ, శేషం వెంకటేశ్వరావు, శ్రీనివాసరావు, కేబుల్‌ ప్రసాద్‌, గుత్తా రమేష్‌, యాదల శ్రీనివాసరావు, శేషం కనకరత్నం, షేక్‌ జానీ, దివ్వెల కోటేశ్వరరావు, బండ్ల నరేంద్ర, సతీష్‌, బాణావతు సైదులు నాగవరపు స్వామి పాల్గొన్నారు. అవనిగడ్డ : స్థానిక కార్యాలయంలో మాజీ ఉప సభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ కేక్‌ కట్‌ చేశారు. మాజీ జెడ్పిటిసి కొల్లూరి వెంకటేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు యాసం చిట్టిబాబు గాజుల మురళి కష్ణ చెన్ను గాంధీ మాదివాడ రత్న రావు న్యాయవాది మాదివాడ వెంకటకష్ణ పాల్గొన్నారు.