
ప్రజాశక్తి-నందిగామ, చందర్లపాడు (కృష్ణా) : నందిగామ నియోజకవర్గ పరిధిలోని చందర్లపాడు తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. 2020 సంవత్సరం నుంచి స్పందన లో అందిన సుమారు 17 ఫిర్యాదుల మేరకు ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ కార్యాలయంలో రికార్డులను తనిఖీ చేశారు. ఎసిబి డిఎస్పీ శరత్ ఆధ్వర్యంలో సిబ్బంది సోదాలు నిర్వహించారు. తహశీల్దార్ సుశీలదేవిని చాలాసార్లు ఫిర్యాదులపై ప్రశ్నించారు. ఉదయం పదకొండు గంటల నుంచి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వెలదికొత్తపాలెం గ్రామానికి చెందిన పసుపులేటి అన్నపూర్ణమ్మ పోలంకు రెండు సంవత్సరాల నుండి పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా పలువురు రైతులు పాస్ పుస్తకాల సమస్యలపై తహశీల్దార్ కార్యాలయం అధికారి, సిబ్బంది పై ఫిర్యాదులు చేశారు. రైతులు ఫిర్యాదుల మేరకు ఎసిబి అధికారులు దాడులు నిర్వహిస్తున్నట్టు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.