Nov 24,2021 19:37

భువనేశ్వర్‌ :  డిజె కారణంగానే తన 63 కోళ్లు చనిపోయాయని.. వారి నుండి పరిహారం ఇప్పించాలంటూ ఒక వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఒడిశాలోని బాలాసోర్‌కి చెందిన . రంజిత్‌ పరిదా అనే వ్యక్తి కోళ్ల ఫారంను నడుపుతున్నాడు. ఆదివారం రాత్రి 11గంటలకు కోళ్ల ఫారానికి సమీపంలో ఒక వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకలో భాగంగా డిజెతో ఊరేగింపు నిర్వహించడంతో పాటు బాణసంచా కాల్చారు. ఆ శబ్దాల తాకిడికి రెండువేల కోళ్లు విలవిలలాడిపోయాయని.. సౌండ్‌ తగ్గించమని కోరినట్లు రంజిత్‌ తెలిపారు. మద్యం మత్తులో ఉన్న పెళ్లి బృందం తనతో వాగ్వివాదానికి దిగిందని అన్నారు. డిజె శబ్దాలకు కోళ్లు తట్టుకోలేకపోయాయని.. చివరికి అవి చనిపోయాయని చెప్పారు. తీవ్రమైన శబ్దాలు, బాణాసంచా కారణంగానే కోళ్లు చనిపోయినట్లు వెటర్నరీ డాక్టరు కూడా స్పష్టం చేశారని  అన్నారు. దీంతో చనిపోయిన  63 కోళ్లకు పెళ్లి బృందం నుండి నష్టపరిహారం ఇప్పించాలని పోలీసులను కోరారు. అయితే ఈ నష్టపరిహారం చెల్లించేందుకు పెళ్లి బృందం నిరాకరించింది.