
- లేకపోతే 4 రాష్ట్రాల ఎన్నికల్లోనూ కర్ణాటక పరిస్థితే
- కిసాన్ మహా పంచాయత్‌లో సత్యపాల్ మాలిక్ హెచ్చరిక
- కొనసాగిన రెజ్లర్ల ఆందోళన
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపి, రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలని జమ్ము కాశ్మీర్ మాజీ గవరుర్ సత్యపాల్ మాలిక్ డిమాండ్ చేశారు. ఆడబిడ్డలకు న్యాయం చేయకపోతే రానున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి కర్ణాటక తరహా పరిస్థితే వస్తుందని హెచ్చరించారు. హర్యానాలోని జింద్-నర్వానా జాతీయ రహదారి ఖట్కర్ టోల్ ప్లాజా వద్ద గురువారం నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్‌లో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం అహంకారంతో ఉందన్నారు. న్యాయం చేయాలంటూ దేశంలోని ఆడబిడ్డలు వీధుల్లో తిరుగుతున్నా కేంద్రం పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు.
రెజ్లర్ బజరంగ్ పునియా మాట్లాడుతూ ఈ పోరులో కచ్చితంగా విజయం సాధిస్తామని అన్నారు. ఈ నెల 28న పార్లమెంట్ ఎదుట జరిగే మహాపంచాయత్‌కి మహిళలు, యువత అత్యధికంగా చేరుకోవాలని కోరారు. పూర్తి శాంతి, క్రమశిక్షణతో పాల్గనాలని సూచించారు. మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్ మాట్లాడుతూ తాను పతకం తెచ్చినప్పుడు ఇక్కడ కూతుళ్లకు ఎంతో గౌరవం ఉందని, కానీ ఇప్పుడు వీధిలో కూర్చునే పరిస్థితి వచ్చినా కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. అధికార పార్టీకి చెందిన బలమైన ప్రజాప్రతినిధి కావడం వల్లే స్వేచ్ఛగా విడిచిపెట్టారని విమర్శించారు. ఇది త్రివర్ణపతాక వైభవం కోసం జరుగుతును పోరాటమని అన్నారు. కుస్తీ మాత్రమే కాదు, అనిు క్రీడల్లోనూ బ్రిజ్ భూషణ్ లాంటి వారు ఉనాురని, వారందరినీ ఏరివేయాలని, ఇందుకోసం బాధితులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 9053903100 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వడంతో దేశంలోని ప్రతి మహిళ ఈ పోరాటంలో తమ గళాన్ని వినిపించాలని విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తును ఆందోళన గురువారం నాటికి 33 రోజులు పూర్తి చేసుకుంది. ఈనెల 28న కొత్త పార్లమెంట్ ఎదుట దేశ మహిళా క్రీడాకారులు తలపెట్టిన మహాపంచాయత్‌కు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల్లో ఆటగాళ్లు ప్రజల మద్దతు కూడగడుతున్నారు.