
పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఉపాధ్యాయులు
ప్రజాశక్తి - చోడవరం : పాత పెన్షన్ విధానం పునరుద్ధరణకై సెప్టెంబర్ ఒకటో తేదీన జరుగు చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ముద్రించిన వాల్ పోస్టర్‌ను గురువారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోఉపాధ్యాయులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నిలబెటు ్టకోవాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తున్నారని చెప్పారు. తమ సమస్యల పరిష్కారానికి తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి ఉపాధ్యాయులు అందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపిసిపిఎస్‌ఇఎ జిల్లా ప్రెసిడెంట్ కోరుకొండ సతీష్, జి. సింహాద్రి, ఎన్.భరత్, చిరంజీవి, మౌళి, శ్రీను, పాల్గొన్నారు.