Jun 23,2021 16:14

చాగలమర్రి (కర్నూలు) : గ్రామాలలో మహిళ సంరక్షణ కార్యదర్శులు, మహిళా మిత్రలు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆళ్ళగడ్డ రూరల్‌ సిఐ రాజశేఖర్‌రెడ్డి కోరారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌ ఆవరణంలో బుధవారం జిఎమ్‌ఎస్‌కె, మహిళా మిత్రలతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ.. గ్రామాలలో ఏ విషయం వల్లనైనా శాంతి భద్రత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటే వాటిని ముందుగానే గుర్తించి సమాచారం అందజేయాలన్నారు. నాటుసారా, మట్కా, గ్యాంబ్లింగ్‌లకు సంబంధించి కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామాలలో సంచరిస్తుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే మహిళలకు దిశ యాప్‌ గురించి అవగాహన కల్పించాలన్నారు. గ్రామాలలో మహిళల సమస్యలను గుర్తించి వాటి పరిష్కరించేందుకు అందరం కృషి చేద్దామన్నారు. కార్యక్రమంలో హెడ్‌ కానిస్టేబులు బలరాముడు, శ్రీనివాసులు, జిఎమ్‌ఎస్‌కెలు, మహిళా మిత్రలు పాల్గొన్నారు.