Aug 19,2022 09:18

న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ శుక్రవారం ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా నివాసంపైన, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌ ప్రాంతంలోని21 చోట్ల సిబిఐ దాడులు చేసింది. మద్యం విధానంలో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న పేరుతో సిబిఐ ఈ దాడులు జరిపింది. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను దెబ్బతీయడమే లక్ష్యంగా కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం తరచూ దుర్వినియోగపరుస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సిసోడియా నివాసంపై సిబిఐ దాడులు రాజకీయ రంగు సంతరించుకున్నాయి.
మద్యం టెండర్లలో నిబంధనల ఉల్లంఘన జరిగిందను ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నరు వికె సక్సేనా ఏకపక్షంగా సిఫార్సు చేశారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖకు ఇన్‌ఛార్జిగా ఉను మనీశ్‌ సిసోడియా పేరును అందులో ప్రస్తావించారు. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సిబిఐ ఢిల్లీలోని సిసోడియా నివాసంపైన, కార్యాలయంపైన, ఎక్సైజ్‌ మాజీ కమిషనరు గోపీకృష్ణ తదితరుల ఇళ్లపైన దాడులు చేసి, విస్తృతంగా సోదాలు నిర్వహించింది.

  • సిబిఐకి స్వాగతం : సిసోడియా

సిబిఐ దాడుల విషయానిు మనీశ్‌ సిసోడియా ట్విట్టర్‌ వేదికగా ధ్రువీకరించారు. 'మా ఇంట్లో సిబిఐ అధికారులకు స్వాగతం పలికాం. దర్యాప్తునకు మా వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తాం. అప్పుడే నిజానిజాలు త్వరగా బయటకు వస్తాయి. అప్పటిదాకా నా మీద ఎన్ని కేసులు పెట్టినా ఏమీ జరగదు. ఉత్తమ విద్య కోసం నేను చేస్తును కృషిని ఎవరూ ఆపలేరు. అయితే.. దేశం కోసం మంచి పనులు చేస్తోన్న వారిని ఇలా వేధించడం దురదృష్టకరం. అందుకే మన దేశం నెంబర్‌ వన్‌గా మారలేకపోతోంది' అని సిసోడియా పేర్కొన్నారు.

సిబిఐ దాడులపై ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనరు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల స్పందిస్తూ, మనీశ్‌ సిసోడియా నివాసంలో తనిఖీలు చేపట్టడం ఇదే మొదటిసారి కాదని,ఈ దాడులకు పార్టీ భయపడదని అన్నారు. ఈ రోజే ఢిల్లీ ఎడ్యుకేషన్‌ మోడల్‌ను ప్రశంసిస్తూ అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ మొదటి పేజీలో కథనాన్ని, మనీశ్‌ సిసోడియా ఫొటోను ప్రచురించిందని, దీనిని చూసి మోడీ ప్రభుత్వం ఓర్వలేకపోతోందనడానికి ఈ దాడులే నిదర్శనమని ఆయన అన్నారు.