Nov 30,2022 14:35

టెహ్రాన్‌  :   ఇరాన్‌లో బుధవారం ఆందోళనకారులు వినూత్నంగా తమ నిరసనను వ్యక్తం చేశారు. ఫిఫా వరల్డ్‌కప్‌లో అమెరికా చేతిలో ఇరాన్‌ ఓటమిపాలవడంతో యువత వీధుల్లోకి వచ్చి ఉత్సాహంగా ఆడిపాడారు. ఇటీవల తమ జట్టు అపజయం పాలవడంతో బ్రెజిల్‌ రాజధాని బ్రసెల్‌లో అభిమానులు వాహనాలను తగులబెట్టి విధ్వంసం సృష్టించారు. అయితే అందుకు విరుద్ధంగా ఇరాన్‌ వీధుల్లో ఆనందోత్సాహాలతో డ్యాన్సులు వేస్తూ నిరసన తెలిపారు. ఇరాన్‌లో అణచివేత పాలనలో భాగంగా ఫుట్‌బాల్‌ జట్టును కూడా వారు తిరస్కరించారు. దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్న సమయంలో ఫుట్‌బాల్‌ టీమ్‌ వరల్డ్‌ కప్‌లో పాల్గొనడాన్ని  వ్యతిరేకిస్తున్నారు.  పోలీసుల కస్టడీలో మరణించిన మాసా అమ్ని స్వస్థలమైన సకేజ్‌తో పాటు ఇరాన్‌లోని పలు నగరాల్లో పౌరులు బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఇరాన్‌ పుట్‌బాల్‌ జట్టుపై అమెరికా తొలిగోల్‌ చేసిన తర్వాత సకేజ్‌లో బాణా సంచా కాల్చడం ప్రారంభించారు. తాను అమెరికా సాధించిన గోల్స్‌కి ఉత్సాహంగా సెలబ్రేట్‌ చేసుకుంటానని ఎవరూ ఊహించరని ఇరాన్‌ స్పోర్ట్స్‌ జర్నలిస్ట్‌ సయీద్‌ జఫ్రాని ట్వీట్‌ చేశారు. అమెరికా గోల్స్ కొడితే మూడు అడుగుల ఎత్తుకి గెంతుతానని తాను కూడా అనుకోలేదని అన్నారు.   ఇరాన్ ప్రభుత్వాన్ని, ఫుట్ బాల్ బృందాన్ని కూడా వ్యతిరేకిస్తున్నామని అన్నారు   గత కొన్ని రోజులుగా తగలబడుతున్న టైర్స్‌, ఆందోళనకారుల వినూత్న నిరసనలతో నిండిపోయిన సోషల్‌మీడియాలో తాజాగా బుధవారం డాన్సులతో హోరెత్తుతున్న పోస్ట్‌ చేయడం గమనార్హం. గత సెప్టెంబర్‌లో హిజాబ్‌ సరిగా ధరించలేదంటూ మోరాలిటీ పోలీసులు అదుపులోకి తీసుకున్న మాహ్సా అమ్ని కస్టడీలో మరణించడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇరాన్‌ ప్రభుత్వ అణచివేతను వ్యతిరేకిస్తున్నారు.